: ఎన్నికల సభలో హేమమాలినికి వింత అనుభవం.. తాగుబోతు వీరంగం
బీజేపీ ఎంపీ, నాటి డ్రీమ్‌గర్ల్ హేమమాలినికి ఉత్తరప్రదేశ్‌లో వింత అనుభవం ఎదురైంది. మథుర జిల్లాలో శుక్రవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హేమమాలిని మాట్లాడుతూ వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి అండగా నిలవాలని, పార్టీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సరిగ్గా అదే సమయంలో ఓ తాగుబోతు హేమమాలిని మాట్లాడుతున్న స్టేజీ పైకి ఎక్కి హల్‌చల్ చేశాడు. ఆమెకు దండం పెడుతూ వింతగా ప్రవర్తించాడు. బీజేపీ నేతలు నచ్చజెబుతున్నా వినకుండా హేమమాలినితో మాట్లాడందే స్టేజీ దిగేది లేదని తేల్చి చెప్పాడు. ఎవరు చెప్పినా తాగుబోతు మాట వినకపోవడంతో చివరికి పార్టీ కార్యకర్తలు కల్పించుకుని అతడిని బలవంతంగా కిందికి దించాల్సి వచ్చింది. అనంతరం తిరిగి హేమమాలిని తన ప్రసంగం కొనసాగించారు.