: దళితులపై ఇంత వివక్షా? చంద్రబాబు సర్కార్ కు ఓ నమస్కారం!: టీడీపీ ఎంపీ శివప్రసాద్ కూతురు
'తప్పు చేసిన వారిని రక్షిస్తారా? దళితులపై ఇంత వివక్షా? చంద్రబాబు సర్కార్ కు ఓ నమస్కారం' అంటూ టీడీపీ ఎంపీ శివప్రసాద్ కూతురు మాధవీలత మండిపడ్డారు. చంద్రబాబు సర్కార్ లో మహిళలకు రక్షణ లేదని, ఈ ప్రభుత్వం తనకు తీవ్ర అన్యాయం చేసిందని ఆమె వాపోయారు. కాగా, తిరుపతిలో మాధవీలత కారు డ్రైవర్ ను కులం పేరుతో దూషించి, అతనిపై చేయిచేసుకున్న దీపక్ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మాధవీలత ఈ వ్యాఖ్యలు చేశారు.