: కొత్త వంద నోట్లను త్వరలో విడుదల చేయనున్న ఆర్బీఐ!


కొత్త వంద నోట్లను త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఒక ప్రకటనలో పేర్కొంది. గతంలో విడుదల చేసిన మహాత్మా గాంధీ సిరీస్-2005 వంద నోట్ల డిజైన్ మాదిరిగానే ఈ కొత్త వందనోట్లు కూడా ఉంటాయని పేర్కొంది. ఈ కొత్త నోట్లను త్వరలోనే బ్యాంకులకు పంపుతామని, ఈ  నోట్ల నంబర్ ప్యానెల్స్ లో ఇన్ సెట్ లెటర్ ‘R’, ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం, నోటు వెనుక 2017లో ముద్రించినట్టుగా ఉంటుందని తెలిపింది. నోట్లపై నంబర్లు అసెండింగ్ ఆర్డర్ లో ఉండటంతో పాటు బ్లీడ్ లైన్స్ ఉంటాయని, గతంలో విడుదల చేసిన వందనోట్లు అన్నీ చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ
స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News