: వేశ్య పాత్రలో నటించేందుకు ప్రియాంక ఓకే చెప్పిందట!
బాలీవుడ్ అందాల నటి ప్రియాంకా చోప్రా వేశ్య పాత్రలో నటించనున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. ఓ కథ ఆధారంగా ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ను ఇప్పటికే ప్రియాంకకు వినిపించారని, విన్న వెంటనే నటించేందుకు ఆమె ఓకే చెప్పిందని తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం అమెరికా టీవీ సిరీస్ క్వాంటికో, బేవాచ్ సినిమాలో ప్రియాంక నటిస్తోంది. ఈ రెండు పూర్తయిన తర్వాతే భన్సాలీ తెరకెక్కించనున్న చిత్రంలో ప్రియాంక నటిస్తుందట. బాలీవుడ్ లో ప్రియాంక నటించిన ఆఖరి చిత్రం ‘జై గంగాజల్’.