: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు అందించిన సర్కారు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర‌ ప్రభుత్వ ఉద్యోగులకు స‌ర్కారు తీపిక‌బురు అందించింది. గ‌త ఏడాది పెంచిన 3.1444 శాతం డీఏను విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఈ రోజు జారీ చేసింది. మార్చి నెల జీతంతో కలిపి ఈ డీఏను అందిస్తున్న‌ట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. డీఏ బకాయిలను ఏప్రిల్‌లో పీఎఫ్ ఖాతాలో జమ చేయనున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ ఉత్త‌ర్వుల జారీ ప‌ట్ల ప్ర‌భుత్వ ఉద్యోగ సంఘాలు ఆనందం వ్య‌క్తం చేశాయి.

  • Loading...

More Telugu News