: కోహ్లీ సేనను చూసి నేర్చుకోండి: తమ జట్టు సభ్యులకి మ్యాక్స్‌వెల్ సూచన
ఈ నెల 23 నుంచి ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య క్రికెట్ మ్యాచులు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ టూర్‌పై స్పందించిన ఆసిస్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్... భారత్‌లో ఆడే నాలుగు టెస్టుల్లో స్పిన్నర్లను ఎదుర్కోవాలంటే విరాట్ కోహ్లీతో పాటు ఇతర టీమిండియా బ్యాట్స్‌మన్‌ను చూసి నేర్చుకోండని తమ జట్టు సభ్యులతో అన్నాడు. జట్టు ఒకే వ్యూహంతో ఆడితే స్పిన్నర్లను ట్యాకిల్ చేయడం కష్టమని ఆయన చెప్పాడు. టీమిండియా బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా ప్రమాదకరమని కూడా అన్నాడు. ఇది తమ జట్టుకి నిజమైన పరీక్ష అని, తమ జట్టు పరుగులు చేయాలంటే ఎంతో శ్రమించాలని అన్నాడు. ఇన్నింగ్స్ మధ్యలోనైనా సరే ఆట వ్యూహం మార్చుకోగలగాలని, టీమిండియా బ్యాట్స్‌మన్ కూడా ఇదే వ్యూహాన్ని అమలుపరుస్తున్నారని వ్యాఖ్యానించాడు.