: ఈ నెల చివరి వారంలో భారత్ లో పర్యటించనున్న సత్య నాదెళ్ల
ఈ నెల చివరి వారంలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల భారత్ లో పర్యటించనున్నారు. ఫిబ్రవరి 21, 22 తేదీల్లో ముంబయిలో జరగనున్న ‘ఫ్యూచర్ డీకోడెడ్’ ఈవెంట్ నేపథ్యంలో ఆయన ఇక్కడికి రానున్నారు. ఈ ఈవెంట్ లో సుమారు 1500 మంది వ్యాపారులు, ప్రభుత్వ అధికారులు పాల్గొననున్నారు. కాగా, వలసవాదులపై అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకించిన వారిలో సత్య నాదెళ్ల కూడా ఒకరు. హెచ్ 1బీ వీసాల చట్ట సవరణతో నైపుణ్యం గల ఉద్యోగులపై ట్రంప్ తీసుకున్న నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతుందనే విమర్శలు తలెత్తుతున్నాయి.