: తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఆకాశానికెత్తేసిన ఏపీ ఎమ్మెల్యే
వరంగల్‌లోని కాజీపేటలో నిర్వహించిన బాలవికాస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొని మాట్లాడిన గుంటూరు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ఆకాశానికెత్తేశారు. కేసీఆర్ లాంటి నాయకత్వం ఏపీలో లేదని తాను బాధపడుతున్నానని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల కష్టాలపై స్పందిస్తూ కేసీఆర్ వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారని ఆయన ప్రశంసించారు. రాష్ట్ర పాలనలో తమ రాష్ట్రానికి, తెలంగాణకు పొంతన లేదని, ఏపీలో అవకాశవాద రాజకీయాలు నడుస్తున్నాయని ఆయన విమర్శించారు. అక్కడ పేదల కష్టాలను గురించి ఆలోచించే పరిస్థితి లేదని అన్నారు. అలాగే తెలంగాణలో హరీష్‌రావు లాంటి నేత ఉండటం కూడా ప్రజల అదృష్టమని, తమ రాష్ట్రంలో మీడియా మేనేజ్‌మెంట్ తప్ప సమస్యలను పట్టించుకోవడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.