: వరుణ్ తేజ్ చిత్రం ఔట్ డోర్ షూటింగ్.. పోటెత్తిన గ్రామస్తులు!
యువ నటుడు వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘మిస్టర్’. రంగారెడ్డి జిల్లా దేవరంపల్లి గ్రామంలోని ఈసీ వాగు బ్రిడ్జిపై ఈ చిత్రం షూటింగ్ నిన్న ప్రారంభమైంది.ఈ చిత్రం షూటింగ్ ఐదు రోజుల పాటు ఇక్కడే జరుగుతుందని చిత్ర బృందం తెలిపింది. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ ను, ఇతర నటీనటులను చూసేందుకు సమీప గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో అక్కడికి వెళ్లారు. కాగా, శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి, హెబ్బాపటేల్ కథానాయికలుగా నటిస్తున్నారు.