: అన్ని పార్టీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ
ఎస్సీ వర్గీకరణ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని పార్టీల నేతలకు లేఖలు రాశారు. రాష్ట్ర అసెంబ్లీలో ఇప్పటికే ఎస్సీ వర్గీకరణపై ఓ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్‌పై ప్రతిపక్ష పార్టీలు కొన్ని నెలల నుంచి ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పెద్దల నుంచి అపాయింట్‌మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 6న సీఎం కేసీఆర్ నేతృత్వంలో అఖిలపక్షం ఢిల్లీకి బయలుదేరి మోదీతో చర్చించనుంది.