: గోద్రా అనంతర అల్లర్ల కేసు: నిందితులందరినీ నిర్దోషులుగా తేల్చుతూ కోర్టు తీర్పు


గుజరాత్ గోద్రా ఘటన అనంతరం జరిగిన అల్లర్ల కేసులో ఈ రోజు గాంధీనగర్ కోర్టు తీర్పు వెల్ల‌డించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 26 మందికి సంబంధించి స‌రైన సాక్ష్యాలు లేక‌పోవ‌డంతో వారంద‌రినీ నిర్దోషులుగా పేర్కొంటూ కోర్టు తీర్పిచ్చింది. ఇప్పటికే వారంతా బెయిల్‌పై విడుద‌ల‌య్యారు. వారిలో కలోల్ నాగరిక్ సహకారీ బ్యాంకు ప్రస్తుత చైర్మన్ గోవింద్ పటేల్ కూడా ఉన్నారు. ఈ కేసులో సాక్షులుగా ఉన్న వారు తాము నిందితులను గుర్తించలేమని కోర్టు ముందు చెప్పడంతో కోర్టు ఈ తీర్పుని ఇచ్చింది. తమకు ఎవరిపైనా కోపం లేదని కూడా వారు అన్నారు.

మతసామరస్యాన్ని సాధించే క్ర‌మంలో ఈ కేసులో నిందితులుగా ఉన్న‌వారు ఇప్పటికే మైనారిటీలకు తగిన నష్టపరిహారం చెల్లించారని కోర్టు పేర్కొంది. 2002 ఫిబ్రవరి 27వ తేదీన గోద్రా రైల్వేస్టేషన్‌లో సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలును తగలబెట్టిన సంగ‌తి తెలిసిందే. అనంత‌రం మ‌రుస‌టి రోజు గాంధీనగర్ జిల్లాలోని కలోల్ తాలూకా పాలియాడ్ గ్రామంలో మైనారిటీలపై ప‌లువురు దారుణానికి పాల్ప‌డ్డారు. ఆస్తుల ధ్వంసం,  దోపిడీ వంటి దారుణ నేరాల‌కు పాల్పడి, ఈ కేసులో వీరంతా నిందితులుగా ఉన్నారు. ఆ రోజు ఆ దాడిలో మొత్తం 250 మంది పాల్గొన్నార‌ని, ఒక‌ ప్రాంతంపై దాడి చేసి దర్గాలో కొంత భాగాన్ని కూడా ధ్వంసం చేశార‌ని అప్ప‌ట్లో పోలీసులు పేర్కొన్నారు.

 

  • Loading...

More Telugu News