: కోహ్లీపై స్లెడ్జింగ్ కు పాల్పడితే ‘బ్యాట్’ తోనే సమాధానమిస్తాడు: ఆసీస్ మాజీ క్రికెటర్ హస్సి


టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దూకుడును నిలువరించే క్రమంలో అతనిపై స్లెడ్జింగ్ కు పాల్పడతామని ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మిచెల్ హస్సీ స్పందించాడు. దూకుడు స్వభావం గల టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై స్లెడ్జింగ్ కు పాల్పడితే  తన బ్యాటింగ్ తోనే అతను సమాధానం చెబుతాడని అన్నాడు.  కోహ్లీపై స్లెడ్జింగ్ కు పాల్పడవద్దని తమ క్రికెటర్లకు సూచించాడు. తానైతే, కోహ్లీపై స్లెడ్జింగ్ కు పాల్పడనని, ఆ విధంగా చేస్తే మనకే నష్టమని అన్నాడు. ఎంతో నైపుణ్యం గల కోహ్లీ, తమ జట్టుకు నిజమైన పోటీదారుడని అన్నాడు. స్లెడ్జింగ్ పై దృష్టి పెట్టే బదులు, భారత్ తో త్వరలో జరగనున్న నాలుగు టెస్టు మ్యాచ్ ల సిరీస్ ను సొంతం చేసుకోవడంపై ఆస్ట్రేలియా క్రికెటర్లు దృష్టి సారించాలని హస్సి సూచించాడు.

  • Loading...

More Telugu News