: పేపర్ పై పెన్నుతో రాసి అన్ని వివరాలు చెబుతున్నారు: దాసరి గురించి చిరంజీవి
దాసరి నారాయణరావు త్వరగా కోలుకుని నాలుగు రోజుల్లో ఇంటికి తిరిగి వస్తారని మెగాస్టార్ చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. మాట్లాడే పరిస్థితిలో లేనప్పటికీ, అన్ని విషయాలను పేపరుపై రాసి వివరాలను తెలుసుకుంటున్నారని చెప్పారు. ఇలాంటి పరిస్థితిలో కూడా తన 'ఖైదీ నంబర్ 150' సినిమా కలెక్షన్ల గురించి అడిగారని సంతోషం వ్యక్తం చేశారు. 150వ సినిమా రూ. 150 కోట్ల వసూళ్లను దాటిందని తాను చెప్పగా... రూ. 250 కోట్లు దాటాలంటూ దాసరి ఆకాంక్షించారని చిరు తెలిపారు. దాసరి ఆత్మస్థైర్యమే ఆయనను కోలుకునేలా చేసిందని చెప్పారు.
మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు కూడా దాసరిని పరామర్శించారు. వైద్యులను అడిగి దాసరి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు అయిన దాసరి త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.