: 6 నుంచి ‘ఫ్లిప్ కార్టు’ ద్వారా ‘బ్లేడ్ ఏ2 ప్లస్’ అమ్మకాలు
ప్రముఖ స్మార్ట్ ఫోన్ ఉత్పత్తుల సంస్థ జెడ్ టీఈ బ్లేడ్ ఏ2 ప్లస్ అనే కొత్త స్మార్ట్ ఫోన్ ను భారత్ లో విడుదల చేసింది. ఈ నెల 6 నుంచి ప్రముఖ ఈ-కామర్స్ పోర్టల్ ‘ఫ్లిప్ కార్ట్’ ద్వారా ఈ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. 4 జీబీ ర్యామ్, 1.5 గిగా హెడ్జ్ఆక్టాకోర్ ప్రాసెసర్, 13 ఎంపీ వెనుక కెమెరా, డ్యుయల్ ఎల్ఈడీ ఫ్లాష్, 5.5 అంగుళాల తెర, 4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమొరీ, డ్యుయల్ సిమ్, 4 జీ సపోర్ట్ చేసే ‘బ్లేడ్ ఏ2 ప్లస్’లో బ్యాటరీ కెపాసిటీ 5000 ఎంఏహెచ్ గా ఉంది.