: త‌స్మాత్ జాగ్ర‌త్త‌... ఆసుప‌త్రుల్లో మొబైల్ ఫోన్ల వల్ల 81.8 శాతం ఇన్ఫెక్షన్ల వ్యాప్తి!


 ఆసుప‌త్రుల్లో ఉన్న‌ పేషెంట్లకు ఏమాత్రం ఇన్ఫెక్షన్లు సోకకుండా ఆయా ఆసుపత్రులు జాగ్ర‌త్త‌లు తీసుకుంటాయి. అందుకే ఐసీయూలలోకి ఎవరినీ అనుమతించరు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, ఆసుప‌త్రుల్లో సెల్‌ఫోన్ల వాడకం వల్ల 81.8 శాతం బ్యాక్టీరియల్ పాథోజెన్‌లు వ్యాప్తి చెందుతున్నాయ‌ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నిర్వహించిన సర్వే ద్వారా తెలిసింది. ఇక హ్యాండ్ స్వాబ్‌ల వల్ల 80 శాతం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వ్యాపిస్తున్నాయట.

దీనికి కార‌ణాల‌ను తెలుపుతూ ఒకే మొబైల్ ఫోన్‌ను పలువురు ఉపయోగించడం వల్లే ప్రధానంగా ఇన్ఫెక్షన్లు వస్తున్నాయ‌ని స‌ర్వేలో పేర్కొన్నారు. ఒక‌ మొబైల్ పోన్‌ని ఒకరు వాడినప్పుడు వాళ్ల చేతులకు ఉండే బ్యాక్టీరియా ఫోన్‌కు అంటుకుంటుందని,  ఆ ఫోన్‌ను వేరొకరికి ఇస్తే వారికి కూడా ఆ ఇన్ఫెక్షన్ వస్తుందని చెప్పారు. ఈ స‌ర్వే అనంత‌రం ఇన్ఫెక్షన్లను అరికట్టడానికి పాటించాల్సిన సూత్రాలను తెలుపుతూ ఐసీఎంఆర్ ప‌లు సూచ‌న‌లు విడుదల చేసి, వాటిని ఐసీఎంఆర్ వెబ్‌సైట్‌లో ఉంచింది. లోక్‌సభలో ఒక సభ్యుడు అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే లిఖిత‌పూర్వ‌కంగా స‌మాధానం చెబుతూ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.

  • Loading...

More Telugu News