: ఈ ఇద్దరు యువరాజులు యూపీని నాశనం చేయాలనుకుంటున్నారు: అమిత్ షా


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ లపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మండిపడ్డారు. ఈ ఇద్దరు యువరాజులు కలసి యూపీని నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారని విమర్శించారు. గతంలో వీరిద్దరూ దేశాన్ని దోచేశారని... ఇప్పుడు యూపీపై పడ్డారని అన్నారు. ఇంకా చెప్పాలంటే యూపీని ధ్వంసం చేయాలనుకుంటున్నారని తెలిపారు. యూపీని అభివృద్ధి చేసేందుకు వీరు ముందుకు సాగడం లేదని విమర్శించారు. ఈ ఒక్కసారికి వీరిని పక్కన పెట్టి, బీజేపీకి అధికారం కట్టబెట్టాలని యూపీ ప్రజలకు ఆయన విన్నవించారు. మీరట్ లో రోడ్ షో పాల్గొన్న ఆయన... ఓటర్లను ఉద్దేశించి ప్రసంగిస్తూ పైవ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News