: అత్యాధునిక ‘న్యూ హోండా సిటీ’ కారు ప్రీ బుకింగ్స్ ప్రారంభం


కొత్త హంగులతో తీర్చిదిద్దిన ‘న్యూ హోండా సిటీ’ కారు ఈ ఏడాదిలో భారత్ మార్కెట్ లోకి విడుదల కానుంది. ఈ నేపథ్యంలో న్యూ హోండా సిటీ మధ్య స్థాయి సెడాన్ సిటీ కార్లకు ప్రీబుకింగ్స్ ప్రారంభించినట్టు ‘హోండా కార్స్ ఇండియా’ అధ్యక్షుడు, సీఈవో వోయిచిరో యునో ఒక ప్రకటనలో  పేర్కొన్నారు. ముందస్తు బుకింగ్ నిమిత్తం అధీకృత హోండా డీలర్ వద్ద రూ.21,000 వేలు చెల్లించాలని పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి 14న ఈ కారును విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని, దేశంలో ‘హోండా సిటీ’ కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి ఈ మోడల్ అత్యంత విజయవంతంగా కొనసాగుతోందని వోయిచిరో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News