: జుకర్ బర్గ్ ను మరింత సంపన్నుడిని చేసిన ముఖేష్ అంబానీ!


ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ ను రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మరింత సంపన్నుడిని చేశారు. ఆయనకు, ఈయనకు లింక్ ఏమిటి అనుకుంటున్నారా? గత ఏడాది సెప్టెంబర్ 5 నుంచి రిలయన్స్ జియో సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఉచిత ఇంటర్నెట్ ఆఫర్ ఉండటంతో... జనాలు దీన్ని విపరీతంగా వాడుతున్నారు. దీంతో, ఫేస్ బుక్ వినియోగం భారీ స్థాయిలో పెరిగింది. ఫేస్ బుక్ నికర లాభాలు ఏకంగా 128 శాతం పెరిగాయి. డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికానికి ఫేస్ బుక్ లాభాలు రూ. 23,567 కోట్లకు పైగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ముఖేష్ అంబానీకి జుకర్ బర్గ్ కృతజ్ఞతలు తెలిపారు.

  • Loading...

More Telugu News