: బెంగళూరులో రెడ్ అలర్ట్.. సోదాలు నిర్వహిస్తున్న పోలీసులు


బెంగళూరు సిటీలో పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. నగర శివార్లలో ఈ ఉదయం జరిగిన తుపాకీ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. నగరంలోని అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ ప్రెసిడెంట్ శ్రీనివాస ప్రయాణిస్తున్న కారు ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగింది. ఆ సమయంలో బైక్ పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో శ్రీనివాస్ తో పాటు, అతని డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. శ్రీనివాసపై హత్యానేరంతో పాటు పలు పోలీసు కేసులు ఉన్నాయి. ఈ కాల్పుల నేపథ్యంలోనే బెంగళూరులో రెడ్ అలర్ట్ ప్రకటించారు. నగరవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News