: ఆస్థిపంజరంలాంటి ఏపీకి సిక్స్ ప్యాక్ తెప్పిస్తానంటున్నారు: చంద్రబాబుపై భూమన ఫైర్


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు కోటలు దాటుతున్నాయని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. ఆస్థిపంజరంలా తయారైన ఏపీకి సిక్స్ ప్యాక్ తెప్పిస్తాననే తరహాలో చంద్రబాబు మాట్లాడుతున్నారని అన్నారు. రాష్ట్రంలోని అన్ని రంగాలు క్షీణించి పోయాయని చెప్పారు. విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులో ఏపీకి లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయనే భ్రమల్లో చంద్రబాబు బతుకుతున్నారని దుయ్యబట్టారు. ఏపీని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చూస్తోందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెబుతుంటారని... కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ఒక్క రూపాయైనా ఎక్కువగా ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఈ విషయంలో వెంకయ్యను చంద్రబాబు ఎందుకు నిలదీయడం లేదని మండిపడ్డారు. ఏపీ ప్రయోజనాలను చంద్రబాబు, వెంకయ్య ఇద్దరూ తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు.  

  • Loading...

More Telugu News