: రూ. వంద కోసం ఇటుక‌ల‌తో కొట్టి చంపేసిన మ‌హిళ‌!


వంద రూపాయ‌ల కోసం ఓ వ్య‌క్తి ప్రాణం తీసిన దారుణ ఘ‌ట‌న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో చోటు చేసుకుంది. త‌మ వ‌ద్ద కేవ‌లం వంద రూపాయలు అప్పు తీసుకున్న వ్య‌క్తి తిరిగి చెల్లించ‌లేద‌న్న ఆగ్ర‌హంతో ఓ మ‌హిళ మ‌రో వ్య‌క్తితో క‌లిసి ఈ దారుణానికి పాల్ప‌డింది. అప్పు తీసుకున్న వ్య‌క్తిని వారు ఇటుకలతో కొట్టిన‌ట్లు పోలీసుల ద‌ర్యాప్తులో తేలింది. మృతుడు హమీద్ (30) గా ఇల్లెందు పోలీసులు గుర్తించారు. కేసు ద‌ర్యాప్తు చేసుకున్న‌ పోలీసులు నిందితులను అరెస్టు చేసి ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు.

  • Loading...

More Telugu News