: అన్ని పరుగులూ నేనే చేసేస్తే మిగతా వాళ్లేం చేయాలి?: మీడియాపై కోహ్లీ రుసరుస


ఇంగ్లండ్ తో టీ-20 సిరీస్ లో ఓపెనర్ గా వచ్చి విఫలమైన కోహ్లీని అదే విషయమై ప్రశ్నిస్తే, సహనం కోల్పోయి మీడియాపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. కోహ్లీ తన ఫామ్ ను కోల్పోయిన విషయాన్ని ఓ పాత్రికేయుడు ప్రస్తావించగా, 2016 ఐపీఎల్ సీజన్ లో ఓపెనర్ గా వచ్చి నాలుగు సెంచరీలు సాధించిన సంగతిని గుర్తు చేశాడు. ఆనాడు తన ఆటను అందరూ పొగిడారని, ఇప్పుడు మూడు మ్యాచ్ లలో పరుగులు చేయలేకపోతే, విమర్శిస్తున్నారని రుసరుసలాడాడు. అయినా పరుగులన్నీ తానే చేసేస్తే, మిగతా ఆటగాళ్లంతా ఏం చేయాలని మండిపడ్డాడు. మిగతా 10 మందిపైనా దృష్టిని పెట్టాలని, జట్టు గెలిచిందన్న ఆనందాన్ని అనుభవించనీయండని అన్నాడు. కాగా, ఇంగ్లండ్ తో మూడు మ్యాచ్ లలో కోహ్లీ వరుసగా 29, 21, 2 పరుగులు మాత్రమే చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News