: ఆల్రెడీ లవ్ ఫెయిల్యూర్... రష్మీతో అఫైర్ లేదు: 'సుడిగాలి' సుధీర్


సినీ, టీవీ నటి రష్మితో తనకు ఎలాంటి అఫైర్ లేదని కామెడీ షో 'జబర్దస్త్'తో పాప్యులర్ అయిన సుడిగాలి సుధీర్ తెలిపాడు. ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ, తాము చేసే స్కిట్స్ లో మరిన్ని నవ్వులు పండేందుకే అలా చెబుతుంటారని అన్నాడు. అలాగే తనను అమ్మాయిల పిచ్చోడిగా కూడా స్కిట్ లలో పేర్కొంటారని, అవి నిజమనుకుని తనకు పిల్లనిచ్చేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అయినా తనకు ఇంతకు ముందే లవ్ ఫెయిలైందని చెప్పాడు. అప్పటి నుంచి వివాహానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. తాను ఎక్కువగా పని నుంచి బ్రేక్ తీసుకుంటానని, రెండేసి రోజులు ఎక్కడికైనా వెళ్లి వస్తుంటానని చెప్పాడు. 

  • Loading...

More Telugu News