: దాసరిని పరామర్శించిన చిరంజీవి, అల్లు అరవింద్, అంబటి రాంబాబు
కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావును మెగాస్టార్ చిరంజీవి పరామర్శించారు. తన బావమరిది అల్లు అరవింద్ తో కలసి ఆయన కిమ్స్ హాస్పిటల్ కు వచ్చారు. వైకాపా నేత అంబటి రాంబాబు, ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ కూడా ఆసుపత్రికి వచ్చి దాసరిని పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాసరి కోలుకుంటున్నారని తెలిపారు.