: తొలి రోజే సత్తా చూపిన బీఎస్ఈ... ఇష్యూ ప్రైస్ పై రూ. 279 లాభం


ఆసియాలో అత్యంత పురాతన ఎక్స్ఛేంజ్ గా ఉన్న బీఎస్ఈ, ఐపీఓ తరువాత తొలి రోజు లిస్టింగ్ లో అదరగొట్టింది. ఇష్యూ ధర రూ. 806 కాగా, నేడు ట్రేడింగ్ బరిలోకి దిగిన సంస్థ షేర్ సెకన్ల వ్యవధిలో 34.62 శాతం లాభపడి రూ. 1,085కు దూకింది. బీఎస్ఈ ఈక్విటీ 5 నుంచి 15 శాతం వరకూ తొలి రోజు లాభాన్ని అందించవచ్చని మార్కెట్ పండితులు అంచనా వేయగా, అంతకు రెట్టింపుకు పైగా లాభాన్ని అందుకుంది. గత నెల 23న బీఎస్ఈ ఐపీఓ మార్కెట్ ను తాకగా, అమ్మకానికి ఉంచిన వాటాలతో పోలిస్తే, 51 రెట్లు అదనంగా సబ్ స్కైబ్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ 1.52 ట్రిలియన్ డాలర్లు కాగా, ప్రపంచంలోని అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజీల్లో బీఎస్ఈది 11వ స్థానం.

  • Loading...

More Telugu News