: గాంధీ ఆసుపత్రిలో నర్సుల మధ్య పోటాపోటీ ఆందోళనలు
గాంధీ ఆసుపత్రిలో పోటాపోటీ ఆందోళనలు నడుస్తున్నాయి. తమను రెగ్యులర్ చేయాలంటూ గత కొంత కాలంగా కాంట్రాక్టు నర్సులు ఆందోళన చేస్తుండగా, వారికి పోటీగా నేడు రెగ్యులర్ విధులు నిర్వర్తిస్తున్న నర్సులు ఆందోళనకు దిగారు. ఆందోళనలు చేస్తున్న కాంట్రాక్టు నర్సులను తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్టు, రెగ్యులర్ నర్సుల పోటాపోటీ ఆందోళనలతో గాంధీ ఆసుపత్రి మార్మోగుతుండగా, సమస్యపై పోరాటం చేస్తున్న కాంట్రాక్టు నర్సులకు పోటీగా రెగ్యులర్ నర్సులు కూడా ఆందోళనకు దిగడంతో సరిపడా సిబ్బంది అందుబాటులో లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు.