: చంద్రబాబు స్వగ్రామానికి రానున్న గార్మెంట్స్ పరిశ్రమ
సంక్రాంతి పండుగ సందర్భంగా తన స్వగ్రామం నారావారిపల్లెకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు... రెండు వరాలను ప్రకటించారు. సొంతూరితో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని మహిళలకు ఉపాధి లభించేందుకు, ఆదాయం పెరిగేందుకు గార్మెంట్ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీనికి తోడు, పాడి ఆవులకు వసతి గృహం నిర్మిస్తామని తెలిపారు. ఆయన చెప్పిన కొన్ని రోజుల వ్యవధిలోనే గార్మెంట్స్ పరిశ్రమ స్థాపన ప్రాథమిక పనులు పూర్తయ్యాయి. నారావారిపల్లెకు సమీపంలో ఉన్న రామిరెడ్డిగారిపల్లెలో రూ. 40 కోట్లతో ఏకేఆర్ టెక్స్ టైల్స్ గార్మెంట్స్ పరిశ్రమను ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాది ఆఖరుకల్లా పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ పరిశ్రమ వల్ల 1500 మందికి ఉపాధి లభించనుంది.