: రాష్ట్రపతి భవన్ లో అగ్నిప్రమాదం!
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. రాష్ట్రపతి భవన్ లోని అకౌంట్స్ విభాగంలో మంటలు చెలరేగడంతో, అక్కడ పని చేస్తున్న సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటీన అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.