: నేడు జియోమీ రెడ్ మీ నోట్ 4 ఫ్లాష్ సేల్... ధర రూ. 9,999
రెండు వారాల క్రితం భారత మార్కెట్లోకి విడుదలై నిమిషాల వ్యవధిలో అందుబాటులో ఉంచిన స్మార్ట్ ఫోన్లన్నీ విక్రయమై సంచలనం కలిగించిన జియోమీ రెడ్ మీ నోట్ 4 నేడు మరో విడత అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లాష్ సేల్ నేడు మధ్యాహ్నం 12 గంటలకు 'మీ డాట్ కామ్'లో ప్రారంభమవువుందని సంస్థ పేర్కొంది. 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 9,999గా, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 10,999గా జియోమీ వెల్లడించింది. ఎలాంటి ముందస్తు రిజిస్ట్రేషన్లు లేకుండా ఫోన్లను కొనుగోలు చేయవచ్చని తెలియజేసింది. కాగా, 5.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే, 13/5 ఎంపీ కెమెరా, డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్, 4జీ వీఓఎల్టీఈ, 4,100 ఎంఏహెచ్ తదితర సదుపాయాలు ఉన్నాయని గుర్తు చేసింది.