: యూపీఏ వేధించింది...ఎన్డీయే ఆటలాడుకుంటోంది: విజయ్ మాల్యా


సీబీఐ ప్రకటన తనను ఆశ్చర్యానికి గురి చేసిందని ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా తెలిపారు. ఇంగ్లండ్ లో ఉంటూ ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాలు చెబుతున్న విజయ్ మాల్యా మరోసారి స్పందించారు. సీబీఐ సెలెక్టివ్ గా ఈ మెయిల్స్ రిలీజ్ చేస్తోందని, దీంతో మీడియాకు కావాల్సినంత మేత దొరుకుతుందని ఆయన పేర్కొన్నారు. సీబీఐలో ఉండే పోలీసులకు వ్యాపారంపై ఎంత అవగాహన ఉంటుందని ఆయన ప్రశ్నించారు. తొలుత యూపీఏ గవర్నమెంటు, ఇప్పుడు ఎన్డీయే గవర్నమెంటు తనను ఫుట్ బాల్ లా ఆటాడుకుంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

  • Loading...

More Telugu News