: ట్రంప్ కు మరో ఎదురుదెబ్బ... సలహాదారుల టీమ్ నుంచి తప్పుకున్న ఉబెర్ చీఫ్ ట్రావిస్


ఇమిగ్రేషన్ విధానాన్ని కఠినం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు సలహా సంఘ సభ్యుడిగా సేవలందించడమేంటని తనపై వస్తున్న విమర్శలతో ఉబెర్ టెక్నాలజీస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ట్రావిస్ కలానిక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ బిజినెస్ అడ్వయిజరీ గ్రూప్ నకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. "ట్రంప్ సలహా సంఘంలో ఉన్నానంటే, ఆయన తీసుకున్న అన్ని నిర్ణయాలతోనూ ఏకీభవిస్తున్నట్టు కాదు. ఆయన అజెండాను అంగీకరించినట్టు కాదు" అని తన ఉద్యోగులకు రాసిన ఈమెయిల్ లో ట్రావిస్ పేర్కొన్నారు. ఇమిగ్రేషన్ విధానంతో తమ సంస్థ కూడా నష్టపోనున్నదని చెప్పుకొచ్చారు. వలస సమస్యను పరిష్కరించేందుకు మరెన్నో మార్గాలున్నాయని అన్నారు. కుటుంబాలు విడిపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని తెలిపారు. కాగా, ట్రంప్ సలహాదారుల్లో ట్రావిస్ ఉండటంపై సోషల్ మీడియాలో అంతకుముందు విమర్శలు వెల్లువెత్తాయి. ఉబెర్ ఖాతాలను డిలీట్ చేసుకోవాలన్న ప్రచారం జోరుగా సాగింది.

  • Loading...

More Telugu News