: పవన్ కల్యాణ్ నినాదం రామాయణంలో పిడకల వేటలా ఉంది: నారాయణ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శలు గుప్పించారు. దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూస్తున్నారని... ఉత్తరాది పాలకులు ఇలాగే వ్యవహరిస్తే ఉద్యమాలు పుట్టుకొస్తాయంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. పవన్ వ్యాఖ్యలు రామాయణంలో పిడకల వేటలా ఉన్నాయని విమర్శించారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల ప్రజా సమస్యలు పక్కదారి పడతాయని తెలిపారు. ప్రజలను మోసగించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడులను మించిన వారు మరెవరూ లేరని అన్నారు.