: బ్రెగ్జిట్ కు ఓకే చెప్పిన బ్రిటన్ పార్లమెంట్


యూరోపియన్ యూనియన్ నుంచి తప్పుకునేందుకు (బ్రెగ్జిట్) అవసరమైన చర్చలను ప్రారంభించేందుకు బ్రిటన్ పార్లమెంటు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికోసం ప్రవేశపెట్టిన బిల్లును దిగువ సభ 384 ఓట్ల మెజారిటీతో ఆమోదించింది. బిల్లుకు వ్యతిరేకంగా 114 ఓట్లు రాగా, అనుకూలంగా 498 ఓట్లు వచ్చాయి. బిల్లు ఆమోదం పొందడంతో, బ్రెగ్జిట్ పై చర్చలు జరిపేందుకు ప్రధాని థెరిసా మేకు సంపూర్ణ అధికారం దక్కింది. పార్లమెంటు ఎగువ సభలో బిల్లుకు ఆమోదం లభించగానే... అది చట్టరూపం దాల్చనుంది. బ్రెగ్జిట్ ప్రక్రియను ప్రారంభించడానికి పార్లమెంటు ఆమోదం తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన నేపథ్యంలో, ఓటింగ్ ను నిర్వహించారు.

  • Loading...

More Telugu News