: అంతర్గతంగా మాట్లాడుకుంటున్న విషయాలు బయటకు ఎలా పోతున్నాయి ?: మంత్రులకు క్లాస్ పీకిన కేసీఆర్
పలువురు మంత్రుల పనితీరు పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. కొందరు మంత్రుల కుటుంబ సభ్యులు పైరవీలు చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఎవరైనా ప్రవర్తిస్తే, చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. మనం అంతర్గతంగా మాట్లాడుకుంటున్న విషయాలు బయటకు ఎలా పొక్కుతున్నాయని ఆయన ప్రశ్నించారు. కొందరు మంత్రులు తమకు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యమాల పేరుతో కోదండరామ్ జిల్లాల్లో తిరుగుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుంటే, ఆయా జిల్లాల మంత్రులు ఎందుకు తిప్పికొట్టడం లేదని ప్రశ్నించారు.