: మరోసారి పార్లమెంటుకు ప్రత్యేక హోదా బిల్లు... లోక్ సభలో ప్రవేశపెడుతున్న వైకాపా!


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంటు ముందుకు మరో ప్రైవేటు బిల్లు రానుంది. గత పార్లమెంట్ సెషన్ లో కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రాజ్యసభలో ప్రవేశపెట్టిన హోదా ప్రైవేటు బిల్లును మనీ బిల్లుగా పేర్కొంటూ సభ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. ఈ దఫా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేటు బిల్లును లోక్ సభలో పెట్టాలని నిర్ణయించింది. పార్టీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ఈ బిల్లును లోక్ సభలో నేడు ప్రవేశపెట్టనుండగా, ప్రైవేటు మెంబర్ బిజినెస్ లో 9వ ఐటెంగా లిస్ట్ అయింది. హోదాను సాధించేవరకూ పోరాటం తప్పదని ఇప్పటికే వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News