: నేటి నుంచే విశాఖలో బీచ్ ఫెస్టివల్!


ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం, ఏపీ ఆర్థిక రాజధాని అయిన విశాఖ బీచ్ ఫెస్టివల్ నేడు ప్రారంభం కానుంది. సాధారణంగా జనవరి మొదటి వారంలో జరగాల్సిన బీచ్ ఫెస్టివల్ రెండు సార్లు వాయిదా పడి నేటికి కార్యరూపం దాలుస్తోంది. ఈ నేపథ్యంలో బీచ్ లో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బీచ్ ఫెస్టివల్ ను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, మంత్రి గంటా తదితరులు ప్రారంభించనున్నారు. స్వర్ణ భారతీ స్టేడియంలో బ్యాడ్మింటన్ తో పాటు, వివిధ క్రీడలు నిర్వహించనున్నారు. అనంతరం వెంకయ్యనాయుడు డిజీధన్ మేళాను వైజాగ్ లో ప్రారంబించనున్నారు. 

  • Loading...

More Telugu News