: ఐదేళ్లలో అందుబాటులోకి 'ఎగిరే' కారు?


టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతోంది. రోజురోజుకీ సరికొత్త టెక్నాలజీతో ఎన్నో సౌకర్యాలు చేకూరుతున్నాయి. ఎప్పటికప్పుడు సరికొత్త ఆవిష్కరణలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో, సోషియో ఫాంటసీ సినిమా 'స్టార్ వార్స్'లో లాగా ఇకపై కార్లు గాల్లో చక్కర్లు కొట్టనున్నాయి. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. జెట్‌ ప్యాక్‌ ఏవియేషన్‌ సంస్థ ఈ ఎగిరే కారును రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.
 
రన్ వే అవసరం లేకుండా, ఉన్నపళంగా నిటారుగా గాల్లోకి లేచి, రయ్ మంటూ దూసుకుపోయేలా ఈ కారును తయారు చేయాలని జెట్ ప్యాక్ ఏవియేషన్ భావిస్తోంది. ఈ మేరకు ఆ సంస్థ తాజాగా ఫొటోలు విడుదల చేసింది. మొత్తం ఆరు రోటర్లతో కూడిన ఈ ఎగిరే కారులో ప్రస్తుతానికి ఒక్కరు మాత్రమే ప్రయాణించే అవకాశం ఉంది. ఇది పూర్తిగా విద్యుత్తుతోనే పనిచేస్తుందని ఆ సంస్థ తెలిపింది. ప్రస్తుతం దీనిని గంటకు దాదాపు 130 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా తయారు చేస్తున్నారు. భవిష్యత్ లో దీని వేగాన్ని పెంచుతారు. అన్నీ సవ్యంగా సాగితే మరో ఐదేళ్లలో ఈ సరికొత్త ఎగిరే కారు అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఈ సంస్థ ప్రకటించింది. 

  • Loading...

More Telugu News