: తిరుమల, అరసవెల్లి, విశాఖ శారదా పీఠంలో వైభవంగా రథసప్తమి వేడుకలు
తిరుమలలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తిరుమలకు భక్తులు పోటెత్తారు. నేటి తెల్లవారు జామునుంచే ప్రత్యేకపూజలు జరుగుతున్నాయి. శ్రీవారు సూర్యప్రభ వాహనంపై ఊరేగుతున్నారు. అలాగే అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సూర్యదేవుని ఆలయానికి భక్తులు తరలివచ్చారు. భారీ ఎత్తున భక్తులు అరసవెల్లి చేరుకోవడంతో వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేదపారాయణం మధ్య సూర్యనారాయణ స్వామికి క్షీరాభిషేకం నిర్వహిస్తున్నారు. అలాగే విశాఖపట్టణంలోని శారదా పీఠంలో స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.