: ట్రంప్ హెయిర్, హెల్త్ రహస్యాలు వెల్లడించిన వ్యక్తిగత వైద్యుడు!


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను చూస్తే సిల్కులాంటి నిగనిగలాడే ఒత్తైన జుట్టు, ఎత్తైన రూపం, ఇంకా అందగాడే అన్నట్టు కనిపిస్తారు. అలాంటి ట్రంప్ సీక్రెట్లను ఆయన వ్యక్తిగత వైద్యుడు వెల్లడించారు. 70 ఏళ్ల వయసులో కూడా బట్టతల రాకుండా ఉండేందుకు, పొడవైన జుట్టు కోసం ట్రంప్‌ ప్రొస్టేట్‌ సంబంధిత మందులు (ఫినాస్టెరైడ్‌) వాడేవారన్నారు. ఫినాస్టెరైడ్‌ ను మగవాళ్లలో బట్టతల నివారణకు కూడా వినియోగిస్తారు. అలాగే బుగ్గలు, నుదుటి భాగంలో ఎర్రటి దద్దుర్లు (రొజెసియా) తగ్గేందుకు యాంటీ బయాటిక్స్ కూడా ఆయన తీసుకునేవారు.

రక్తంలోని కొలెస్ట్రాల్‌ తో పాటు కొవ్వు తగ్గేందుకు ఆయన స్టాటిన్స్ వాడేవారని, అంతే కాకుండా గుండెపోటు ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు ఆయన రోజూ ‘బేబీ ఆస్పిరిన్ ’ తీసుకునేవారని 1980 నుంచి ట్రంప్ కు వ్యక్తిగత వైద్యుడిగా సేవలందించిన హరొల్డ్‌ ఎన్  బోర్నస్టెయిన్  న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికకు తెలిపారు. ఆరోగ్యం విషయంలో ట్రంప్‌ ఎప్పుడూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News