: వర్మ కామెంట్లు లంచ్ బ్రేక్ లో మాట్లాడుకోవడానికి తప్పా ఎందుకూ పనికిరావు: చిరంజీవి కుమార్తె సుస్మిత
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా చేసే కామెంట్లను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని, లంచ్ బ్రేక్ లో మాట్లాడుకోవడానికి తప్పా ఆ కామెంట్లు ఎందుకూ పనికిరావని చిరంజీవి కుమార్తె సుస్మిత వ్యాఖ్యానించారు. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ఖాళీ సమయంలో వర్మ ట్వీట్లు చూసి నవ్వుకుంటామని, ఒకరు మాట్లాడే మాటలను మనం నియంత్రించలేమని, ఎందుకంటే, ప్రతి ఒక్కరికీ మాట్లాడే స్వేచ్ఛ ఉందని అన్నారు. అయితే, పూర్తిగా నెగెటివ్ గా మాట్లాడే వారిని సామాజిక మాధ్యమాల నుంచి బ్లాక్ చేయాలని ఆమె సూచించారు.