: ‘శరణం గచ్ఛామి’ సినిమాకు అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన!
‘శరణం గచ్ఛామి’ సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వాలని కోరుతూ తెలంగాణ స్టూడెంట్స్ యూనియన్ ఆందోళన చేపట్టింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని సెన్సార్ బోర్డు కార్యాలయాన్ని స్టూడెంట్స్ యూనియన్ నేతలు ముట్టడించారు. దీంతో, యూనియన్ నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ‘శరణం గచ్ఛామి’ సినిమాకు సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వని పక్షంలో తమ ఆందోళనను ఉద్ధృతం చేస్తామని స్టూడెంట్స్ యూనియన్ నేతలు హెచ్చరించారు. కాగా, అసభ్య, అశ్లీల చిత్రాలకు సెన్సార్ బోర్డు అనుమతులిస్తూ, సమాజాన్ని ఆలోచింపజేసే ‘శరణం గచ్ఛామి’ చిత్రానికి అనుమతి ఇవ్వకపోవడం సిగ్గుచేటని ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీలు ఇటీవల విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొనడం విదితమే.