: ఆ పేలుళ్లకు సంబంధించిన ఆధారాలు పాక్ లోనే ఉంటాయి: పాక్ కు భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి సమాధానం


అమెరికా నుంచి వస్తోన్న ఒత్తిడితో ముంబయి పేలుళ్ల సూత్రధారి, జమాత్‌ ఉద్‌ దవా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ను పాకిస్థాన్ గృహ నిర్బంధంలో ఉంచిన సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్‌... ముంబయి పేలుళ్లకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు తమకు అందించాలని భారత్‌ను కోరడంతో ఈ అంశంపై భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వికాస్‌ స్వరూప్‌ స్పందించారు. ముంబయి దాడికి సంబంధించిన ప్రణాళిక అంతా పాకిస్థాన్‌లోనే జరిగిందని ఆయ‌న అన్నారు. ఉగ్రవాదులు కూడా ఆ దేశం నుంచే వచ్చారు కాబ‌ట్టి, పేలుళ్ల కుట్ర‌కు సంబంధించిన ఆధారాలు కూడా పాకిస్థాన్‌లోనే ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని ఆయన స‌మాధాన‌మిచ్చారు.

  • Loading...

More Telugu News