: రైనా కొట్టిన ‘సిక్సర్‌’ బాల్ తగిలి విలవిల్లాడిపోయినా.. మళ్లీ మ్యాచ్ చూడడానికి వెళ్లిన బాలుడు!


నిన్న బెంగళూరులో ఇంగ్లండుతో జరిగిన టీ20 మ్యాచులో టీమిండియా బ్యాట్స్‌మెన్ రైనా కొట్టిన ఓ సిక్సర్ కార‌ణంగా స్టేడియంలో కూర్చున్న ఆరేళ్ల బాలుడు స‌తీష్‌ తొడకు ఆ బాల్‌ బలంగా తగిలిన విష‌యం తెలిసిందే. బాల్ త‌గ‌ల‌డంతో విలవిల్లాడిపోయిన ఆ బాలుడిని వెంటనే స్టేడియంలోని ఆసుప‌త్రికి తరలించి, చికిత్స అందించారు. అయితే, ఆ త‌రువాత ఏమ‌యిందో తెలుసా? చికిత్స అందించిన‌ పది నిమిషాల తర్వాత ఆ చిన్నారికి నొప్పి తగ్గడంతో మ్యాచ్ చూడడానికి మ‌ళ్లీ వెళతానని అన్నాడు. ఆ చిన్నారి అడగడంతో కాద‌న‌లేక‌పోయిన‌ వైద్య సిబ్బంది... బాలుడి కోరిక‌ను తీర్చారు. ఆ బాలు స‌తీష్ తలపైన గానీ, మెడపైన గాని తగిలి ఉంటే కనుక పరిస్థితి విష‌మం అయ్యేదని డాక్టర్లు అన్నారు.

  • Loading...

More Telugu News