: కడప కార్పొరేటర్లు మళ్లీ వైఎస్సార్సీపీ గూటికే !
గతంలో వైఎస్సార్సీపీని విడిచి టీడీపీలో చేరిన ఆరుగురు కార్పొరేటర్లు మళ్లీ పాత గూటికే చేరారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఇడుపులపాయలో ఈరోజు నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆరుగురు కార్పొరేటర్లకు పార్టీ కండువాలు కప్పారు. కాగా, కడప కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున గెలిచిన సదరు కార్పొరేటర్లు గతంలో టీడీపీలో చేరారు. ఆ పార్టీ ఎమ్మెల్యే అంజాద్ బాషా, మేయర్ సురేష్ బాబు ఆధ్వర్యంలో ఆ కార్పొరేటర్లు తిరిగి తమ సొంత గూటికి చేరారు.