: ‘యువీ, ధోనీ, ఆష్ భాయ్, వాట్ ఏ విక్టరీ!’ అంటూ సెల్ఫీ పోస్ట్ చేసిన కోహ్లీ
భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మూడు ఫార్మాట్లలో సిరీస్ లను కైవసం చేసుకున్న టీమిండియా ఆనందానికి పట్టపగ్గాలు లేవు. ముఖ్యంగా తాను సారథ్యం వహించిన తొలి వన్డే, టీ 20 సిరీస్ లను టీమిండియా సొంతం చేసుకోవడంతో కోహ్లీ సంతోషం అంతా ఇంతా అని చెప్పలేము. ఈ నేపథ్యంలో ‘వాట్ ఏ విక్టరీ. యువీ, ధోనీ, అషూ భాయ్...’ అని కోహ్లీ తన ట్విట్టర్ ఖాతాలో సంతోషం వ్యక్తం చేశాడు. ధోనీ, యువీ, ఆశిష్ నెహ్రాలతో దిగిన సెల్ఫీని కోహ్లీ పోస్ట్ చేశాడు. కాగా, టీమిండియా కలిసి దిగిన ఒక సెల్ఫీని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన బీసీసీఐ, టీమిండియాను ‘ఛాంపియన్స్’ అంటూ ప్రశంసించింది.