: అమెరికా ఒత్తిడితో హ‌ఫీజ్‌ స‌యీద్‌పై మ‌రిన్ని చ‌ర్య‌లు తీసుకున్న పాకిస్థాన్!


అమెరికా ప్రభుత్వం పాకిస్థాన్‌పై తీసుకొస్తోన్న‌ ఒత్తిడి మేరకు ముంబయి పేలుళ్ల సూత్రధారి, జమాతుద్‌ దవా ముష్కర నాయకుడు హఫీజ్‌ సయీద్ పై పాకిస్థాన్ పలు చర్యలు తీసుకుంటోంది. జమాతుద్‌ దవాపై చర్యలు తీసుకోకుంటే ఆంక్షలు తప్పవని ఇటీవ‌లే అమెరికా హెచ్చరించిన విష‌యం తెలిసిందే. స‌యీద్‌ను ఇప్ప‌టికే గృహ‌నిర్బంధంలో ఉంచిన పాక్‌.. త్వరలోనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామని తెలిపింది. తాజాగా స‌యీద్ పై స్పందించిన పాక్‌... అతడు దేశ సరిహద్దులు దాటిపోకుండా చర్యలు చేపట్టిన‌ట్లు తెలిపింది. స‌యీద్ పేరును ఎగ్జిట్‌ కంట్రోల్‌ జాబితాలో చేర్చింది. ఇందుకు సంబంధించి ఆ దేశ‌ హోంమంత్రిత్వ శాఖ దేశంలోని అన్ని ప్రావిన్సులతో పాటు ఫెడరల్‌ దర్యాప్తు సంస్థకు ఓ లేఖను కూడా రాసింది. ఆ జాబితాలో హ‌ఫీజ్‌తో పాటు లష్కరే తొయిబా, జమాతుద్‌ దవా ముష్కర సంస్థలతో సంబంధమున్న 38మంది అనుచరుల పేర్లను కూడా చేర్చారు.

  • Loading...

More Telugu News