: గ్రీన్ ఫీల్డ్ నగరాలకు దీటుగా అమరావతి నిర్మాణం: సీఎం చంద్రబాబు


అమరావతి నిర్మాణంపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, గ్రీన్ ఫీల్డ్ నగరాలు అయిన ఛత్తీస్ గఢ్ రాజధాని నయా రాయ్ పూర్, మలేషియా లోని పుత్రజయ, కజకిస్థాన్ రాజధాని ఆస్తానా నగరాలకు దీటుగా అమరావతి రాజధాని నిర్మాణం జరగాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. 2018ని లక్ష్యంగా పెట్టుకుని ప్రాజెక్టులు పూర్తి చేయాలని దివా నిర్దేశం చేశారు. త్వరలో అమరావతిలో విట్, ఎస్ఆర్ఎం, అమృత విశ్వవిద్యాలయాలు, ఆరు జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలు వస్తున్నాయని అన్నారు.

సుమారు రూ.250 కోట్లతో ఒక ఫైవ్ స్టార్, ఫోర్ స్టార్, నాలుగు త్రీ స్టార్ హోటళ్లను నిర్మించనున్నారని తెలిపారు. దేశంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ ను అమరావతిలో నిర్మిస్తున్నామని, వచ్చే ఏడాది నాటికి స్టేడియం-ఎరీనా నిర్మాణం, స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ స్కూల్ ఏర్పాటుకు అంతర్జాతీయ సంస్థ ఒకటి ముందుకొచ్చిందని అన్నారు. గడచిన రెండేళ్లలో అమరావతి అభివృద్ధికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను సీఆర్డీఏ అధికారులు ఈ సందర్భంగా చంద్రబాబుకు వివరించారు.

  • Loading...

More Telugu News