: సరిహద్దు ప్రాంతంలో మరోసారి కాల్పులకు తెగబడిన పాకిస్థాన్ సైన్యం


పాకిస్థాన్ మ‌రోసారి కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్ సాంబా సెక్టార్‌లో బిఎస్ఎఫ్ బలగాలపై కాల్పుల‌కు పాల్ప‌డింది. బిఎస్ఎఫ్ శిబిరంపై గ్రెనేడ్లు విసురుతూ దుస్సాహ‌సం చేసింది. దీంతో వెంట‌నే స్పందించిన బిఎస్ఎఫ్ బలగాలు వారి చ‌ర్య‌ల‌ను తిప్పికొట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కొన్ని రోజులుగా పాకిస్థాన్‌-భార‌త్ స‌రిహ‌ద్దు ప్రాంతం కాస్త ప్ర‌శాంతంగా ఉంది. త‌మ దేశం నుంచి ఉగ్రవాదులను సరిహద్దు దాటించడానికే పాకిస్థాన్‌ సైన్యం కాల్పులకు తెగ‌బ‌డింద‌ని అధికారులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News