: ‘జియో’ ఆఫర్లకు క్లీన్ చిట్... ఎలాంటి తప్పులు లేవని మరోమారు తేల్చి చెప్పిన ట్రాయ్!


‘రిలయన్స్’ జియో ప్రకటించిన ఆఫర్లలో ఎలాంటి తప్పులు దొర్లలేదని టెలికాం రెగ్యులేటరి అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) గతంలో ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ‘వెల్ కం ఆఫర్’, ‘హ్యాపీ న్యూ ఇయర్’ పేరిట జియో ప్రకటించిన ఫ్రీ టారిఫ్ ఆఫర్లు రెండూ వేర్వేరు అని ట్రాయ్ తాజాగా తేల్చి చెప్పింది. మార్చి 1, 2017 వరకు ‘జియో’ ఆఫర్ చేసిన ఉచిత డేటా, వాయిస్ సేవలను వినియోగదారులు నిరభ్యంతరంగా వినియోగించుకోవచ్చని ట్రాయ్ తేల్చి చెప్పింది.

‘జియో’ ప్రకటించిన ఫ్రీ టారిఫ్ ఆఫర్లు జీవిత కాలం ఇవ్వడం సాధ్యం కాదని టెల్కోలు వాదించిన విషయం తెలిసిందే. భారతీ ఎయిర్ టెల్, ఐడియా సెల్యులార్ సహా ఇతర ఆపరేటర్లకు ఈ మేరకు ఈ ఆదేశాలు అందనున్నాయి. కాగా, జియో ఆఫర్ పై ఎయిర్ టెల్, ఐడియా వంటి టెలికాం సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ముఖ్యంగా జియో ఫ్రీ కాలింగ్ ఆఫర్ పై ఎయిర్ టెల్ సంస్థ చైర్మన్ సునీల్ మిట్టల్ అభ్యంతరం వ్యక్తం చేయడం, టెలికాం ట్రైబ్యునల్ ను ఆశ్రయించడం తెలిసిందే. 

  • Loading...

More Telugu News