: మీ సైన్యం భయపడుతుంటే చెప్పండి.. మా సైన్యాన్ని దించుతాం: మెక్సికో అధ్యక్షుడితో డొనాల్డ్ ట్రంప్
మెక్సికోతో తమకున్న విభేదాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరింత పెరిగేలా చేశారు. మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నియతోకి ఫోన్ చేసి మాట్లాడిన ట్రంప్... ఆ దేశంలో అరాచకవాదులు చాలా మంది ఉన్నారని అన్నారు. అక్కడ సైన్యం వారిని అదుపు చేయటంలేదని, మీ దేశ సైన్యం భయపడుతుంటే చెప్పండని, తమ సైన్యాన్ని పంపిస్తామని వ్యాఖ్యానించారు. అమెరికా సైన్యానికి మాత్రం భయంలేదని, అంతా వారే చూసుకుంటారని అన్నట్లు తెలుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలను ఏ సందర్భంలో ప్రస్తావించారన్న అంశంపై స్పష్టత లేదు. దీనిపై శ్వేతసౌధ సిబ్బంది స్పందించడం లేదు. మరోవైపు మెక్సికన్ విదేశీ వ్యవహారాల శాఖ ఈ అంశంపై స్పందిస్తూ ఇటువంటి చర్చ వీరి మధ్య అసలు రాలేదని చెప్పింది. ఇరువురు నేతల మధ్య పూర్తి నిర్మాణాత్మకంగా చర్చలు జరిగాయని తెలిపింది.